Praja Kshetram
తెలంగాణ

భూలక్ష్మీ దేవతకు తీయని నైవేద్యాలు.

భూలక్ష్మీ దేవతకు తీయని నైవేద్యాలు.

 

 

ఆలూర్ జులై 13 (ప్రజాక్షేత్రం):ఆలూర్ మండల కేంద్రంలో భూలక్ష్మి దేవతకు తీయని నైవేద్యాలు వేసి కొలుస్తారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గ్రామ ప్రజలు జరుపుకుంటారు.ఈ పండగను ఆరుద్ర పండగ తర్వాత గ్రామంలో పూర్వ పద్ధతితో భూలక్ష్మి దేవతకు తాతాయి దేవతలకు తీయని నైవేద్యాలు గ్రామస్తులు భక్తులు సమర్పించుకొని కోరినా కోరికలను నెరవేర్చుతాయని పాడి పంటలు ఆయురారోగ్యాలు ఏడాది పాటు చల్లగా ఆ భూలక్ష్మి మాత దీవిస్తుందని నమ్ముతారు. ఈ సందర్భంగా విడిసి అధ్యక్షులు నల్మేళ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా జరిపిన విధంగానే ఈ సంవత్సరం కూడా ఘనంగా భూలక్ష్మిమాతకు అలాగే తాతాయి దేవతలకు ఈ పండగను జరుపమని గ్రామస్తులు మహిళలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఆ దేవతకు నైవేద్యాలు సమర్పించుకొని ఆ పచ్చని పొలాల మధ్య తీయని వంటకాలు చేసుకొని భోజనం చేసి వెళ్తారని అన్నారు. ఈ విధంగా చేస్తే భూలక్ష్మిదేవి ప్రతి ఒక్కరిపై ఆ తల్లి దీవెనలు ఉంటుందని చల్లగా ఊరిని కాపాడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు భక్తులు గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.

Related posts