Praja Kshetram
పాలిటిక్స్

కాంగ్రెస్‌లోకి మహిపాల్ రెడ్డి.. చేరికకు రంగం సిద్ధం.

కాంగ్రెస్‌లోకి మహిపాల్ రెడ్డి.. చేరికకు రంగం సిద్ధం.

 

 

పటాన్ చెరు జులై 13(ప్రజాక్షేత్రం): బీఆర్ఎస్ పార్టీకి చెందిన పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ సొంత జిల్లా అయిన ఉమ్మడి మెదక్ లో ఆ పార్టీని దెబ్బతీసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతుంది. గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు నలుగురు శాసనసభ్యులు ముఖ్యమంత్రి ని కలిసినప్పటి నుంచి ఎమ్మెల్యేల చేరికపై ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ శనివారం ఉదయం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి చెందిన అనుచరులు సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. దీంతో మహిపాల్ రెడ్డి చేరికపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న వేళ శనివారం సాయంత్రం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చర్చలు జరిపినట్లు సమాచారం. త్వరలో తన అనుచరులతో సమావేశం నిర్వహించి కాంగ్రెస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

Related posts