సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలకం.
-పాఠశాల కళాశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ బి శ్రీనివాస్.
మొయినాబాద్ జులై 13(ప్రజాక్షేత్రం): సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని తెలంగాణ సాంఘిక సంక్షేమ చేవెళ్ల గురుకుల పాఠశాల/కళాశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ బి శ్రీనివాస్ అన్నారు. మండల పరిధిలోని తోల్కట్ట గ్రామ సమీపంలో ఉన్న చేవెళ్ల గురుకుల పాఠశాల/కళాశాల ప్రధాన ఉపాధ్యాయులు డి రమాదేవి బదలి సందర్భంగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. తదుపరి ఉపాధ్యాయులు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవెళ్ల గురుకుల పాఠశాలలో గత ఏడు సంవత్సరాలుగా ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలను చేపట్టి తమ విధులను నిర్వహిస్తూ పాఠశాల ఉపాధ్యాయులను సమన్వయ పరుచుకుంటూ విద్యార్థులకు ప్రేమాభిమానాలు పంచుతూ కన్నబిడ్డల మాదిరిగా చదువులపై శ్రద్ధ పెట్టి అంకితభావంతో పని చేశారని అన్నారు. పాఠశాలే తమ ఇల్లుగా విద్యార్థులే తమ పిల్లలకు భావించి చిత్తశుద్ధితో పాఠశాలను బలోపితం చేసి చేవెళ్ల గురుకుల పాఠశాలకు ప్రత్యేక స్థానంలో ఏర్పాటు చేసిందని చెప్పారు. విద్యార్థులు చదువులో ఉత్తమ ఫలితాలను సాధించడం తో పాటు అన్ని క్రీడాల్లో రాణించే విధంగా ఎంతో ప్రోత్సహించి ఉత్తమ ప్రతిభావంతులుగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఎనలేని కృషి చేశారని తెలిపారు. చేవెళ్ల గురుకుల పాఠశాలకు ప్రత్యేక స్థానం ఏర్పడడంతో అందులో తల్లిదండ్రులు తమ పిల్లలకు సీటు పొందడానికి తీవ్ర పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇదే తరహాలో విద్యార్థుల చదువుల పట్ల క్రీడాల పట్ల శ్రద్ధ చూపిస్తూ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తే గురుకుల పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలల దీటుగా నడుస్తాయని అన్నారు. ప్రతి ఉపాధ్యాయులకి బదిలీలు సర్వసాధారణమని ఎక్కడైనా ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తే సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని అన్నారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు రామగల గిరిబాబు, లక్ష్మణ్, శ్రీకాంత్, శ్రీనివాస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్పన, ఉపాధ్యాయులు అమరావతి పాల్గొన్నారు.