పార్క్ పేరుతో ప్రభుత్వ భూమి కబ్జా….
*-గత ప్రభుత్వం నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించేందుకు శంకుస్థాపన..*
*-డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టేందుకు కాంట్రాక్టర్ ముందుకు రాలేదు…*
*-డబల్ బెడ్ రూమ్ ఇళ్ల స్థలాలలో చెట్లు నాటారు…*
*-రెవెన్యూ అధికారులు నోరు మెదపడం లేదని పలు అనుమానాలు వ్యక్తం…*
*-కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడంతో జర్నలిస్టులకు స్థలాలు కేటాయిస్తామని…*
మొయినాబాద్ జూలై 14(ప్రజాక్షేత్రం): ప్రభుత్వ భూమిలో ఇష్టానుసారంగా కబ్జా నిర్వహించి దాంట్లో ఏకంగా పార్కు ఏర్పాటు చేసి దాంట్లో చెట్లు నాటుతున్న దుస్థితి మొయినాబాద్ మండలంలోని చిలుకూరు రెవెన్యూ సర్వేనెంబర్ 277లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే చిలుకూరు రెవెన్యూ లో ఉన్నటువంటి సురభి ప్రైవేట్ వెంచర్ లో కొంతమంది ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు అయితే ప్రైవేటు వెంచర్ వ్యక్తి పార్కును ప్రభుత్వ భూమిలో చూపించాడని ఈ పార్కు మాకు కావాలని దాని కబ్జా చేసి చెట్లు నాటుతున్నారు. గతంలో ఇదే స్థలంలో నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించాలని అక్కడ ఉన్నటువంటి ఎకరా మూడు గుంటల ప్రభుత్వ భూమిని శిలాఫలకాలు వేశారు. అక్కడ డబుల్ బెడ్ రూమ్ కట్టడానికి కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడంతో అక్కడ ఉన్నటువంటి స్థలాలను జర్నలిస్టులకు ఇస్తామని అన్నారు. అయితే సురభి వెంచర్ లో ఉన్నటువంటి కాలనీవాసులు మా వెంచర్లో ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ అందులో వచ్చి పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటే డబ్బున్న బడాబాబులుగా చలామణి అవుతున్న ఉన్నతులుగా ఈ కాలనీలో ఉన్నామని మీలాంటి పేదవారు వస్తే ఇక్కడ చిన్న చిన్న గుడిసెలు వేసుకొని చిన్న చిన్న ఇల్లు కట్టుకొని మేము ఉంటున్న కాలనీలో సమానంగా ఎలా ఉంటారని అంటూ వాటిని పేదలకు పంచకుండా డబల్ బెడ్ రూమ్ లు కట్టకుండా ప్రభుత్వ భూమిని అందరూ ఏకమై కాలనీవాసులు కబ్జా చేసి ఆ ప్రభుత్వ విని శనివారం ఆదివారం సెలవు దినం రావడంతో వాటిని కబ్జా చేసి చెట్లు నాటుతున్నారు. వెంచర్ చేసిన వారు ప్రవేటు వ్యక్తి వాళ్లకు పార్కు చూపించి ఇళ్లస్థలాల అమ్మితే వెంచర్ చేసినటువంటి వ్యక్తిని పోయి పార్కు స్థలం అడగాలి కానీ ప్రభుత్వ భూమిని కబ్జా చేయడమేంటని స్థానికులు వాపోతున్నారు. ఇది స్థలం చాలా విలువగా మారింది దాదాపు 40 వేల గజం చొప్పున పలుకుతున్న ఆ స్థలంలో బీజాపూర్ హైవే రహదారికి ఆనుకొని ఉన్న ఈ వెంచర్లో గజం భూమి 40,000 పైన మాట అలాంటి స్థలాన్ని ఎకరా మూడు గుంటల భూమిని ఎలా కబ్జా చేస్తారని స్థానికులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా ఈ తతంగం చూస్తూ కూతవేట్టి దూరంలో ఉన్నటువంటి తహశీల్దార్ కార్యాలయం నుండి ఏ అధికారి వచ్చి ఈ అక్రమ కబ్జాను ఆపకపోవడంతో స్థానికులకు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తక్షణమే సురభి వెంచర్ లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని పేదలకు ఇళ్లస్థలాలైన ఇవ్వాలి లేదా ప్రభుత్వ ఆధీనంలో స్వాధీనం చేసుకొని కబ్జాకు యత్నిస్తున్న వ్యక్తులపై చట్టపరి చర్యలు తీసుకోవాలని లేదంటే రెవెన్యూ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందని గ్రామాలలో పేదవాడు అడుగుజాగా ప్రభుత్వ భూమిలోకి జరిగితే కూల్చేసే అధికారులు ఇక్కడ ఎకరా మూడు గుంటల భూమి కబ్జా గురవుతుంటే ఏం చేస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే తాసిల్దార్ ఆపై అధికారులు రెవెన్యూ సిబ్బంది చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.