Praja Kshetram
తెలంగాణ

మైనింగ్ తో అంతారం గ్రామ ప్రజల భవిష్యత్ అంధకారం.

మైనింగ్ తో అంతారం గ్రామ ప్రజల భవిష్యత్ అంధకారం.

 

*-నేల కాలుష్యంతో కలరా, టైఫాయిడ్, లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం.*

*-మైనింగ్ అనుమతులు రద్దు చేయాలి.*

*-ఏ.ఐ.కే.ఎం.ఎస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై. మహేందర్.*

చేవెళ్ల జులై 15(ప్రజాక్షేత్రం):చేవెళ్ల మండలం, అంతారం గ్రామ పరిధిలోని 185 సర్వే నెంబర్ లో కొనసాగుతున్న మైనింగ్ ని వెంటనే నిలిపివేయాలని చేవెళ్ల ఆర్డిఓ సాయిరాం కి అఖిల భారత రైతు కులి సంఘం ( ఏ.ఐ.కే.ఎం.ఎస్ ) ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై. మహేందర్, బి.మల్లేష్ మాట్లాడుతూ 100 ఎకరాల విస్తీర్ణం లో గల గుట్టను ఇప్పటికే నీలమట్టం చేశారని మైనింగ్ వాళ్లు కనీస సంపద కోసం లోతు ఎక్కువగా తవ్వడం వల్ల చెత్తాచెదారం నేల లోకి చేరడంతో భూమి లోపల ఉన్న కొన్ని పదార్థాలను తొలగించడం వల్ల నేల ఉత్పాదకసామెత మొక్కల భూగర్భ జలాల నాణ్యతను తగ్గించే పరిస్థితులు ఏర్పడవచ్చు. దీనివల్ల నేల కాలుష్యం ఏర్పడి భవిష్యత్తులో అంతారం గ్రామ ప్రజల మనుగడ పై తీవ్ర ప్రభావం చూపుతుందని గనుల తవ్వకం ఉపరితల భూగర్భ సారవంతమైన ఏ -దీక్షక్రం, ది-దీక్షక్రం, అను రెండు పొరలు తగ్గిపోవడం వల్ల వృక్ష సంపదపై ప్రభావం పడుతుందని అన్నారు. నేలలోని వివిధ రకాల సూక్ష్మజీవులు మానవునికి సంక్రమించి ధనురాత్వం, కలరా, టైఫాయిడ్, వంటి వ్యాధులు వస్తాయని రేడియోధార్మిక ప్రదర్శన పదార్థాలను శోషించుకున్న వృక్ష జంతుజాలాన్ని మానవుడు ఆహారంగా తీసుకుంటే అది ఆ సాధారణ లక్షణాలకు దారితీసి ఎముకల్లో, కణజాలల్లో నిక్షిప్తం కావడం వల్ల ఎముకలు తెలుసుగా మారుతాయని అన్నారు. అంతారం గ్రామ ప్రజల భవిష్యత్తు దృష్ట్యా పర్యావరణాన్ని కపాడడం కోసం మైనింగ్ అనుమతులు రద్దుచేసి దానిని పూర్తిగా ఇక్కడి నుండి తొలగించాలని అన్నారు. లేదా అఖిల భారత రైతు కూలి సంఘం ( ఏ.ఐ.కే.ఎం.ఎస్ )ఆధ్వర్యంలో ఆందోళనలకు దిగుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్, పిడిఎస్ యు నాయకులు రాజేష్ తదితరులు ఉన్నారు.

Related posts