యువత ఉన్నత లక్ష్యంతో ఎదగాలి ప్రముఖ సింగర్ ఏపూరి సోమన్న.
శంకర్ పల్లి జూలై 15(ప్రజాక్షేత్రం) యువత సమయాన్ని వృధా చేయకుండా ఏదో విధంగా కష్టపడి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఉద్యమ నేత ప్రముఖ గాయకుడు ఏపూరి సోమన్న పేర్కొన్నారు సోమవారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని మాలింగాపురం గ్రామంలో పీఏసీఎస్ డైరెక్టర్ కాడిగరి రాజశేఖర్ రెడ్డి గృహంలో యువతతో కలిసి కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత తనకున్న కొద్దిపాటి సమయాన్ని వృధా చేయకుండా ఏదో ఒక రంగంలో స్థిరపడాలని యువకులు 40 సంవత్సరాలు లోపు కష్టపడితేనే జీవితంలో సుఖంగా జీవించవచ్చని ఆయన అన్నారు. అనంతరం యువకులు ఏపూరి సోమన్న ను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కంది గోవర్ధన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, విట్టల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సత్యం, దాసు, చింటూ, తదితరులు పాల్గొన్నారు