Praja Kshetram
తెలంగాణ

హుడా పార్కు స్థలన్ని కబ్జా చేసి అక్రమంగా కట్టిన ఇండ్లను వెంటనే తొలగించాలంటూ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు.

హుడా పార్కు స్థలన్ని కబ్జా చేసి అక్రమంగా కట్టిన ఇండ్లను వెంటనే తొలగించాలంటూ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు.

 

-కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రెటరీ

చిన్నా ముదిరాజ్.

 

సంగారెడ్డి జులై 15 (ప్రజాక్షేత్రం)‘అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని చక్రపురి కాలనీలో సర్వే నంబర్‌లు126,127, 128,129,130,135,136,137,152&152 హూడ లే అవుట్ పార్కు స్థలంలో అక్రమంగా 4 ఇండ్ల నిర్మాణాలు చేపట్టారన్ని ఈ అక్రమ నిర్మాణాన్ని వెంటనే ఆపాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నాడు ప్రజావాణిలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్న ముదిరాజ్ (బాల మురళీ కృష్ణ) జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అమీన్పూర్ మున్సిపల్ కార్యాలయంలోని టౌన్‌ప్లానింగ్‌ విభాగానికి ఇదే విషయంపై గతంలో రెండు సార్లు ఫిర్యాదు చేశాం. అక్కడ మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదును పరిష్కరించిన పాపాన పోలేదు. అందువల్ల జిల్లా కలెక్టర్ కి చక్రపురి కాలనీలో జరుగుతున్న అక్రమాలను దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. ఇట్టి కబ్జాదారులపై వెంటనే చర్యలు జరిపేలా అప్రూవల్ లేఔట్ లోని పార్క్ స్థలాన్ని పరిశీలించి పార్కులోకి చొరబడి కడుతున్న నాలుగు ఇండ్లను కూల్చివేసి అక్రమంగా కట్టడాలు చేపట్టిన వారిపై చర్యలు తగు తీసుకోవాలని వినతిపత్రం అందజేయడం జరిగిందన్నారు.

Related posts