ఒక ఆటో, 26మంది విద్యార్థులు.
-గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు రవాణా వసతి లేక ఆటోల్లో ప్రమాదకంగా ప్రయాణం చేస్తున్నారు.
-ఒక ఆటో, 26మంది విద్యార్థులు
-బస్సు లేకపోవడంతో ప్రమాదకర ప్రయాణం.
రాజోలి, జూలై 15(ప్రజాక్షేత్రం): గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు రవాణా వస తి లేక ఆటోల్లో ప్రమా దకంగా ప్రయాణం చేస్తున్నారు. గద్వాల జిల్లా రాజోలి మండలం లోని పచ్చర్ల గ్రామంలో ప్రైమరీ పూర్తి చేసుకుని ఉన్నత పాఠశాలకు చదువుకునేందుకు వెళ్లే విద్యార్థులు ప్రమాదక రంగా ఆటోల్లో ప్రయా ణం చేస్తున్నారు. మాన్ దొడ్డి గ్రామంలో ఉన్న జడ్పీహెచ్‌ఎస్ పాఠశా లలో చదువుకు నేందుకు పచ్చర్ల గ్రామం నుంచి దాదాపు 70 మంది విద్యార్థులు ప్రతీ రోజు ఐదు కిలోమీటర్లు వెళ్లాల్సి ఉన్నది. బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ప్రమాదకరమని తెలిసినా ఆటోల్లో కిక్కిరిసి ఇళ్లకు చేరుతున్నారు. సోమవారం 26మంది విద్యార్థులు ఆటోలో ప్రయాణించారు. రహదారులు సరిగా లేక పోవడంతో ఎక్కడ ప్రమాదాలకు గురవుతారోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. గద్వాల బస్సు డిపో అధికారులు స్పందించి క్రమం తప్పకుండా పాఠశాల సమయానికి బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.