మేము ఓడినా… ప్రజలకు అన్యాయం జరగనివ్వం” మాజీ మంత్రి కాకాణి.
నెల్లూరు,జూలై 15(ప్రజాక్షేత్రం): నెల్లూరు జిల్లా,సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలంలోని రిషి కళ్యాణమండపంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలతో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ..ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి అని ఆంధ్ర రాష్ట్రంలో దేశంలోనే ఎక్కడా లేనటువంటి పరిపాలన సంస్కరణలు, పధకాలు ప్రవేశపెట్టారని నేడు అధికారం లేకున్నా, ప్రజలకు అండగా నిలవాలని జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారని నెలరోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వ పోకడలు చూస్తే, ప్రజలను మోసం చేసే విధంగా ఉందని, చంద్రబాబు పరిపాలన అంతా జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం తప్ప మరొకటి లేదని, జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను తీసుకొని రావడం విధ్వాంసమా,పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలన్నీ అందించడం విధ్వాంసమా, పేద, బలహీన వర్గాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి పనిచేశారు అని,సర్వేపల్లి నియోజకవర్గంలో అందరం కలిసి కట్టుగా పనిచేసి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి, పూర్వ వైభవాన్ని తీసుకొని వద్దాం అని తెలిపారు.