సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన గద్వాల ఎమ్మెల్యే.
-పలు అభివృద్ధి పనులపై వినతి పత్రం అందజేత.
హైదరాబాద్,జూలై 15(ప్రజాక్షేత్రం): హైదరాబాద్ నందు సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి గద్వాల నియోజకవర్గంలోని నెట్టెంపాడు, ర్యాలంపాడు, ప్రాజెక్టుల నిర్మాణంలో నీటి సామర్థ్యంలో పెంచాలని అదేవిధంగా గట్టు ఎత్తిపోతల పథకం నీటి సామర్థ్యాన్ని పెంచుతూ నిర్మాణానికి నిధులను విడుదల చేయాలని కోరారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు పెండింగ్ పనుల కోసం నిధులను విడుదల చేయాలని కోరారు.గద్వాల నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పూర్తి అయ్యే విధంగా త్వరగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి నిధులను విడుదల చేసి గద్వాల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ని కోరారు. సీఎం సానుకూలంగా స్పందించి ఎమ్మెల్యే చెప్పిన వాటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి త్వరగా పూర్తి అయ్యే విధంగా చేస్తామని హామీ ఇచ్చారు.