Praja Kshetram
తెలంగాణ

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్.

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్.

 

గద్వాల,జూలై 15(ప్రజా క్షేత్రం):ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల నుండి స్వీకరించిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని గద్వాల జిల్లా కలెక్టర్ బి. యం. సంతోష్ అధికారులకు సూచించారు.సోమవారం సమీకృత గద్వాల జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుండి (48) ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు అందజేసిన అర్జీలను జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్, అదనపు కలెక్టర్లు ముసిని వెంకటేశ్వరులు, నర్సింగరావు లతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చిన దరఖాస్తులను ఎప్పటికి అప్పడు పరిష్కరించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts