Praja Kshetram
ఆంధ్రప్రదేశ్

సదస్సు గోడపతులను ఆవిష్కరించిన స్టీల్ సిఐటియు ప్రతినిధులు.

సదస్సు గోడపతులను ఆవిష్కరించిన స్టీల్ సిఐటియు ప్రతినిధులు.

 

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జూలై 15(ప్రజాక్షేత్రం):విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటున్న సమస్యలపై నిష్ణాతుల తో కార్మికులలో అవగాహన, చైతన్యంన్ని కలిగించి, వారితో సరియైన పోరాటాలను నిర్మించి పోరాడటం ద్వారానే సమస్యకు పరిష్కారం సాధ్యమని స్టీల్ సిఐటియు గౌరవ అధ్యక్షులు జె అయోధ్యరామ్ అన్నారు. స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో “సంక్షోభంలో విశాఖ ఉక్కు-పరిష్కారం ఎలా”అనే సదస్సును నిర్వహిస్తున్న సందర్భంగా సదస్సు గోడ పతులను నేడు స్టీల్ ప్లాంట్ లోని స్టోర్ జంక్షన్ వద్ద విడుదల చేశారు.ఈ సందర్భంగా జె అయోధ్యరామ్ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ కు కలిగిన సంక్షోభాలను ఎదుర్కోవడంలో స్టీల్ సిఐటియు ప్రధాన భూమిక పోషించిందని ఆయన అన్నారు. సమస్యల పరిష్కారం కొరకు నిష్ణాతులచే కార్మికులలో అవగాహన కల్పిస్తూ వారితో కలసి చైతన్యంతో కూడిన పోరాటాలను చేస్తేనే వాటిపై విజయం సాధ్యమని ఆయన వివరించారు. గడచిన కొంత కాలంగా స్టీల్ ప్లాంట్ కు మైన్స్ కేటాయించాలని పాదయాత్రలు, రక్తదానం తదితర కార్యక్రమాల ద్వారా చైతన్యాన్ని కలిగించిన ఘనత స్టీల్ సిఐటియు కు ఉందని ఆయన అన్నారు. నేడు స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటున్న సమస్యకు ప్రధాన కారణంగా దీనిని ప్రభుత్వ యాజమాన్యాలు గుర్తించాయని ఆయన వివరించారు. కనుక ఈ సమయంలో ఈ అంశంపై మరింత అవగాహనను చైతన్యాన్ని కలిగించాలనే ప్రధాన ఆశయంతో జరుగుతున్న ఈ సదస్సును జయప్రదం చేయాలని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు. స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి యు రామస్వామి మాట్లాడుతూ ఈ సదస్సును ఉక్కునగరం స్టీల్ సిఐటియు కార్యాలయం ముందు 17-7-24(బుధవారం) సాయంత్రం 5.30 గంటలకు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. దీనిలో ముఖ్య వక్తలుగా మాజీ స్టీల్ ప్లాంట్ సిఎండి శివసాగర్ రావు గారు, అఖిల భారత సిఐటియు ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ తపన్ సేన్, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జె డి లక్ష్మీనారాయణ, స్టీల్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ లలిత్ మిశ్రా, రాష్ట్ర సిఐటియు ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సిహెచ్ నర్సింగరావు పాల్గొనున్నార ని ఆయన వివరించారు. నేడు స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి వీరు సూచించే మార్గాలపై కార్మికులు అవగాహన కల్పించుకోని తద్వారా మన పోరాటాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించ గలుగుతామని ఆయన అన్నారు. కనుక ఈ సదస్సులో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్టీల్ సిఐటియు నాయకులు పి శ్రీనివాసరాజు, కె గంగాధర్, నీలకంఠం, కృష్ణమూర్తి, టి వి కె రాజు, శంకర్రావు, శ్రీనివాస్ రెడ్డి, వి మురళి, డి ఎస్ వి ఎస్ శ్రీనివాస్, దుర్గాప్రసాద్, ముత్యాల నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Related posts