Praja Kshetram
తెలంగాణ

ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన : గోవిందు నారేష్ మాదిగ.

ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన : గోవిందు నారేష్ మాదిగ.

 

 

 

హైదరాబాద్ జులై 16(ప్రజాక్షేత్రం): గత కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ నిధులు విడుదల కాకపోవడం వల్ల లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతంకు తెలిపారు. కనుక తక్షణమే నిధులు విడుదల చేసి లబ్ధిదారులకు అందేలా చూడాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నారేష్ మాదిగ అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా జనాభా ప్రాతిపదికన 75% నిధులను మాదిగలకు కేటాయించేలా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు. గతంలో జనాభాకు తగిన స్థాయిలో రుణాలు అందకపోవడం వల్ల మాదిగలకు తీవ్ర న్యాయం జరిగింది. తమరి హయాంలో మాదిగలకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇకపోతే మాదిగ వాడలు అనేక సమస్యలకు నిలయాలుగా ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం మౌలిక సదుపాయాలను కల్పించడానికై ఎస్సీ సబ్ ప్లాన్ బడ్జెట్ ను విడుదల చేయాలని కోరారు. తద్వారా రోడ్లు, డ్రైనేజీ, వాటర్ ట్యాంకు నిర్మాణాలతో పాటుగా ప్రతి మాదిగ వాడలో కమ్యూనిటీ హాల్ ల నిర్మాణం చేపట్టాలని అలాగే నూతన రుణాలను మంజూరు చేయడం కోసం కూడా తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని విజ్ఞప్తి చేసారు.

Related posts