Praja Kshetram
తెలంగాణ

నిరుద్యోగుల‌ సమస్యల‌పై అఖిలపక్షం నిర్వ‌హించండి.. రేవంత్‌ను కోరిన ఆర్. కృష్ణ‌య్య‌

నిరుద్యోగుల‌ సమస్యల‌పై అఖిలపక్షం నిర్వ‌హించండి.. రేవంత్‌ను కోరిన ఆర్. కృష్ణ‌య్య‌

 

 

హైద‌రాబాద్ జులై 16(ప్రజాక్షేత్రం): రాష్ట్రంలోని నిరుద్యోగుల స‌మ‌స్య‌ల‌పై అఖిల‌ప‌క్ష స‌మావేశం నిర్వ‌హించాల‌ని సీఎం రేవంత్ రెడ్డిని రాజ్య‌స‌భ స‌భ్యులు ఆర్ కృష్ణ‌య్య కోరారు. నిరుద్యోగుల ఉద్యమాలపై నిర్భందం సరికాదు అని కృష్ణ‌య్య పేర్కొన్నారు. నిరుద్యోగులపై లాఠీచార్జ్ చేయ‌డాన్ని ఆయ‌న తీవ్రంగా ఖండించారు. నీలం వెంక‌టేశ్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన నిరుద్యోగ జేఏసీ స‌మావేశంలో ఆర్ కృష్ణ‌య్య పాల్గొని మాట్లాడారు. ఈ స‌మావేశంలో విద్యార్థి నాయకులు వేముల రామకృష్ణ, గోరేగే మల్లేష్, మోదీ రాందేవ్, మధుసూదన్ రావు, శివకృష్ణ, వీరన్న, మణికంఠ, గోరేగే మల్లేష్ తదితరులు ప్రసంగించారు.

*నిరుద్యోగుల న్యాయ‌మైన డిమాండ్లు ఇవే..*

1. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 1:100 కోరుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలులో అన్యాయం జరిగింది. దీనిపై చర్చించాలి.

2. గ్రూప్-1లో 563 నుంచి 1600కు పోస్టులను పెంచాలని, గ్రూప్-2లో 780 నుంచి 2 వేల‌కు, గ్రూప్-3లో 1100 నుంచి 3 వేల‌కు పోస్టులు పెంచాలి.

3. టీచర్ పోస్టులు 11 వేల నుంచి 25 వేలకు పెంచాలి.

4. డీఎస్సీ రెండు నెలల పాటు వాయిదా వేయాలి.

Related posts