బిఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటా : మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.
శంకర్ పల్లి జులై 16(ప్రజాక్షేత్రం): బిఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటానని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం శంకర్‌పల్లి మండల మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు నాయక్ స్వగృహానికి ఎమ్మెల్యే సబితా రెడ్డి విచ్చేశారు. అనంతరం సబితా రెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ, కారు గుర్తుపై ఎమ్మెల్యేలుగా గెలిచి, కాంగ్రెస్ పార్టీలో చేరిన 10మంది ఎమ్మెల్యేలు పోయిన పార్టీకి ఒరిగేది ఏమీ లేదన్నారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మాత్రం బిఆర్ఎస్ పార్టీని వీడడం లేదని కితాబిచ్చారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లు, మండల,మున్సిపల్ నాయకులు ఉన్నారు.