చేవెళ్ల మెయిన్ రోడ్డు సమస్య అధికారులకు కనబడడం లేదా…
-ఏండ్లు గడుస్తున్న పట్టించుకోని అధికారులు నాయకులు.
-వాహనదారులకు పెద్ద ప్రమాదమే పొంచి ఉంది.
-ఎన్నోసార్లు మేము మా స్వయంకృషితో ఈ గుంతలలో మట్టి నింపాం .
-వెంటనే ఆర్ అండ్ బి అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలి.
-టైర్ పంచర్ షాప్ యజమాని మహమ్మద్ అష్రఫ్.
చేవెళ్ల జులై 16(ప్రజాక్షేత్రం): చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్ ముందు గల హైదరాబాద్ టు వికారాబాద్ జాతీయ రహదారిలో వర్షాకాలం వస్తే చాలు భారీగా వర్షంపు నీరు నిండి పెద్ద పెద్ద గుంతలు పడడం జరుగుతుంది. ప్రక్కనే ఉన్న టైర్ పంచర్ షాప్ యజమాని మహమ్మద్ అష్రఫ్ మంగళవారం చేవెళ్ల ప్రజాక్షేత్రం ప్రతినిధితో మాట్లాడుతూ…. మా షాపు ముందు గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు పూర్తిగా కృంగి కృంగిపోయిందని, వర్షాకాలంలో వర్షపు నీరు భారీగా ఇక్కడే నిలవడంతో కృంగిన రోడ్డుపై భారీ లోడ్ లతో కలిగిన వాహనాల రాకపోకలతో పెద్ద పెద్ద గుంతలు పడ్డాయని,ఈ రోడ్డుపై కొత్తగా ప్రయాణం చేసే వాహనదారులు అనేకసార్లు ఆ గుంతలలో పడి గాయాల పాలయ్యారని,అదృష్టం బాగుండి ఎవరి ప్రాణాలు పోలేవని, ఆర్టీసీ బస్సు లు భారీ లోడు కలిగిన లారీలు అయితే ఆ గుంతలలో ఒక్కవైపు ఓరుగుతున్నాయని, చూస్తున్న మాకు ఆ వాహనాలు కింద పడతాయేమో నన్న భయం కలుగుతుందని, ప్రతి సంవత్సరం మేము మా తోటి మిత్రులు కలిసి ఈ గుంతలలో ఇసుక కంకర వేసి పూడుస్తున్నామని, ఈ వర్షపు నీరు నిలువకుండా ఉండేందుకు రోడ్డు ప్రక్కన నుండి కాలువ నైన తీయాలి లేదా కృంగిన రోడ్డును మరమ్మత్తులు చేసి హైట్ చెయ్యాలని, లేకపోతే వాహనదారుల ప్రాణాలకే ప్రమాదమని, ఇదే రోడ్డుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ కు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ కు చేవెళ్లలో పనిచేసే అధికారులు రాజకీయ నాయకులు నిత్యం ప్రయాణిస్తూ ఉంటారని మరి వారికి ఈ సమస్య కనబడడం లేదేమోనని, ఎవరి ప్రాణాలు పోతే మాకు ఎందుకులే అన్నట్టుగా చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారని, ఇది ఎవరి ఇంటి ముందు ఉన్న సమస్య కాదు సార్ 24 గంటలు వాహనదారులు ప్రయాణిస్తున్న రహదారి కాబట్టి రాజకీయ నాయకులు ప్రత్యేక చొరువ తీసుకొని ఆర్ అండ్ బి అధికారులాతో వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని వేడుకుంటూ, ఈ సమస్య పరిష్కారం ఎంతవరకు ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ ను ఏర్పాటు చేస్తే ఎవరి ప్రాణాలకు ప్రమాదం జరగకుండా ఉంటుందని తెలిపారు.