అంబేద్కర్ అభయ హస్తం పథకం12 లక్షల రూపాయలు అమలు చేయాలి.
-ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతంకు వినతి పత్రం.
-తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ (టి ఎస్ ఎస్ ఓ) వ్యవస్థాపక అధ్యక్షుడు లక్ష్మీ నివాస్.
శంషాబాద్ జులై 16(ప్రజాక్షేత్రం) హైదరాబాద్ దామోదరం సంజీవయ్య భవన్ ఎస్సీ నిరుద్యోగ యువతీ యువకులు అంబేద్కర్ అభయహస్తం పథకం ద్వారా ఉపాధి కల్పించాలని ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో అంబేద్కర్ అభయ హస్తం పథకం ద్వారా 12 లక్షల రూపాయలు అర్హులైన నిరుద్యోగ ఎస్సీ యువతీ యువకులకు అంబేద్కర్ అభయాస్త పథకాన్ని అమలు చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారు మాట్లాడుతూ త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టి ఎస్ ఎస్ ఓ రాష్ట్ర నాయకుడు కర్రే సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు