పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడి.
ఆర్మూర్ జులై 16(ప్రజాక్షేత్రం): ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఆలూర్ గ్రామంలో పేకాట స్థావరం పై దాడి నిర్వహించారు.సిపి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసిపి విష్ణుమూర్తి ఆధ్వర్యంలో ఆర్మూర్ ఎస్సై అంజమ్మ మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది లక్ష్మన్న,రాములు, అనిల్ కుమార్, నరసన్న,ఆజాము లు పేకాట స్థావరంపై దాడి నిర్వహించగా ఏడుగురు మంది పేకాటరాయలు అరెస్టు చేశారు వారి దగ్గర నుండి అలాగే 6 మొబైల్ ఫోన్స్ అమౌంట్ 19390/- రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని మీడియాతో వెల్లడించారు.తదుపరి చర్య నిమిత్తం ఎస్ హెచ్ ఓ ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగిందన్నారు.