Praja Kshetram
తెలంగాణ

చాయ్ పై చర్చలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. 

చాయ్ పై చర్చలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి.

 

 

ఆర్మూర్ జులై 16(ప్రజాక్షేత్రం): ఆర్మూర్ నియోజవర్గం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆలూర్ మండల కేంద్రంలో గాంధీ చౌక్ వద్ద మంగళవారం సాయంత్రం గ్రామస్తులతో రైతులతో చాయ్ తాగుతూ పలు సమస్యలపై ముచ్చటించారు. గ్రామస్తులు అందరు కలిసి ఉండాలని పలు పార్టీల భేదాలు లేకుండా గ్రామంలో విభేదాలు చూపకుండా కలిసికట్టుగా ఉండాలని సూచించారు.వరి నాట్ల గురించి రైతులకు అడిగి తెలుసుకున్నారు. నూతనంగా వేసిన బిటి రోడ్లపై కేజీవిల్ టాక్టర్స్ నడిస్తే రోడ్డు పాడవుతుందని దయచేసి రైతులు దీన్ని గమనించి ఇతర ట్రాక్టర్ నుండి తీసుకువెళ్లాలని ఆయన రైతులతో విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలూర్ మండల అధ్యక్షులు కొత్తూర్ గిరీష్ బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్, ముతెన్న, గంగారెడ్డి, రాజేందర్, మల్లయ్య, మహేష్, నారాయణ, బీజేపీ నాయకులు రైతులు తదితరులు ఉన్నారు.

Related posts