Praja Kshetram
ఆంధ్రప్రదేశ్

గిరిప్ర‌ద‌క్షిణ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన జిల్లా క‌లెక్ట‌ర్.

గిరిప్ర‌ద‌క్షిణ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన జిల్లా క‌లెక్ట‌ర్.

 

 

విశాఖ‌ప‌ట్ట‌ణం జూలై 16 (ప్రజాక్షేత్రం):ఈ నెల 20, 21వ తేదీల‌లో జ‌రిగే సింహాచ‌లం ల‌క్ష్మీ నర‌సింహస్వామి గిరిప్ర‌ద‌క్షిణ మహోత్స‌వ ఏర్పాట్ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ ప‌రిశీలించారు. పోలీస్ క‌మిష‌న‌ర్ ఎస్. బాగ్చి, జీవీఎంసీ ఏడీసీ కె.ఎస్. విశ్వ‌నాథ‌న్, ఆల‌య ఈవో శ్రీ‌నివాస‌మూర్తి, ఇత‌ర అధికారుల‌తో క‌లిసి మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం క‌లెక్ట‌ర్ ట్రైల్ ర‌న్ నిర్వ‌హించారు. అప్పుఘ‌ర్ వ‌ద్ద లుంబినీ పార్కు స‌మీపంలోని స్నాన ఘట్టాన్ని ప‌రిశీలించి అక్క‌డ త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. ఒక వైపు భ‌క్తులు వ‌చ్చేందుకు మ‌రొక వైపు బ‌య‌టకు వెళ్లేందుకు అనువుగా ప్ర‌త్యేక బ్యారికేడింగ్ ఏర్పాటు చేయాల‌ని సూచించారు. బ‌ట్ట‌లు మార్చుకునేందుకు వీలుగా ప్ర‌త్యేక గ‌దుల‌ను ఏర్పాటు చేయాల‌ని చెప్పారు. లుంబినీ పార్కు వ‌ద్ద ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన అనంత‌రం ప్ర‌త్యేక వాహ‌న శ్రేణి ద్వారా ఎంవిపీ, వెంకోజిపాలెం, కైలాస‌పురం, మాధ‌వ‌ధార‌, మురళీ న‌గ‌ర్, ఎన్.ఎస్.టి.ఎల్, గోపాల‌ప‌ట్నం, కుమారి క‌ల్యాణ మండ‌పం, ప్ర‌హ్లాద‌పురం, శ్రీ‌నివాస్ న‌గ‌ర్, గోశాల‌ మీదుగా సింహాచ‌లం చేరుకున్నారు. అనంత‌రం అక్క‌డ జ‌రిగిన స‌మీక్షా స‌మావేశంలో భాగ‌స్వామ్య‌మ‌య్యారు. కార్య‌క్ర‌మంలో జాయింట్ పోలీస్ క‌మిష‌న‌ర్ ఫ‌క్కీర‌ప్ప‌, ఇత‌ర పోలీసు అధికారులు, జీవీఎంసీ, దేవాదాయ శాఖ అధికారులు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Related posts