Praja Kshetram
క్రైమ్ న్యూస్

వెల్మల్ లో దొంగల బీభత్సం తాళం వేసిన ఇండ్లల్లో చోరీ.

వెల్మల్ లో దొంగల బీభత్సం తాళం వేసిన ఇండ్లల్లో చోరీ.

*మ-ఆనవాళ్లు తెలియకుండా పొడికారం చల్లి మరి చోరీ.

-భయం ఆందోళన గ్రామ ప్రజలు.

-క్లూ టీమ్ ఆధారాలు సేకరణ.

నిజామాబాద్ జిల్లా జులై 17(ప్రజాక్షేత్రం):నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు.రాత్రి ఇళ్లలోకి దొంగలు చొరికి పాల్పడిన విజువల్స్ సీసీ కెమెరా లో రికార్డయ్యాయి. రాత్రి తాళాలు వేసిన మూడు ఇళ్లలో భారీ చోరీకి పాల్పడ్డారు. బాధితుడికి గురుకులంలో టీచర్ పోస్టు రావడంతో పోస్టింగ్ తీసుకోవడం కోసం ఇంటికి తాళం వేసి హైదరాబాద్ కు వెళ్లగా మరో కుటుంబం ఇల్లుకు తాళం వేసి వెళ్లగా అది గమనించిన దొంగలు అర్ధరాత్రి ఇంటికి వేసిన తాలాన్ని పగలగొట్టి ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. సుమారు 20 తులాల బంగారం, 18 తులాల వెండి, రూపాయలు 11 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు.ఆనవాళ్లు తెలియకుండా మూడు ఇళ్లల్లో దొంగలు కారంపొడి ఇల్లంత మరీ చల్లి దొంగతనానికి పాల్పడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంకు సమాచారం ఇచ్చారు. చోరీకి గురైన మూడు ఇళ్లల్లో క్లూస్ టీం ఆధారాలు సేకరించారు.అనంతరం నిజామాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఎసిపి సీసీఎస్ కిషన్, క్రైమ్ బ్రాంచ్ సిఐ సురేష్ లు సంఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.ఓకే రాత్రి గ్రామంలోని మూడు ఇళ్లల్లో చోరీకి పాల్పడంతో గ్రామంలో భయందోళన నెలకొంది. గ్రామంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Related posts