కాంగ్రెస్ నాయకుల సంబరాలు.
*-సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం.*
*-రైతు రుణమాఫీ పై రైతుల ఆనందం.*
*-అందరికీ రెండు లక్షల వరకు రుణమాఫీ పక్క.*
*-వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం.*
ఆర్మూర్ జులై 18(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ఖాతాల్లోకి నేరుగా రుణమాఫీ నగదును వేయడంతో రైతులు సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పంట పొలాలలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించి గాంధీ చౌక్ వద్ద టపాసులు కాల్చి మిఠాయిలు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో నేరుగా మాట్లాడేందుకు రైతు వేదికలో భారీ ఎల్ఈడి స్క్రీన్ లో రైతులు వీక్షించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రైతు రుణమాఫీ పట్ల సీఎం రేవంత్ రెడ్డి అన్న మాట నిలబెట్టుకున్నారు అని బిజెపి పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీలకు హడేలు మనేలా సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ 2 లక్షల వరకు పక్క చేస్తారు అని ఈ సందర్భంగా తెలియజేశారు ఒకటో విడతగా లక్ష రూపాయలు రెండో విడతగా లక్ష 50 వేల వరకు అలాగే ఆగస్టు 15 వరకు 2 లక్షలు వరకు పూర్తిగా రుణమాఫీ జరుగుతుందని రైతులు ఎటువంటి ఆందోళన చెందకుండా ఆగస్టు 15 వరకు రెండు లక్షల రుణమాఫీ పూర్తవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆలూర్ మండల అధ్యక్షులు ముక్కెర విజయ్, కాంగ్రెస్ నాయకులు మూలకిడి శ్రీనివాస్,వైఎస్ మల్లారెడ్డి,ఉదయ్,నవనీత్,ముత్యం,భోజన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.