పెండింగ్ స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలి.
*-ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేవెళ్ల ఆర్డీవో కార్యాలయం ముందు భారీ ధర్నా.*
*-లేనిపక్షంలో అసెంబ్లీ ముట్టడిస్తాం.*
*-ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్ అరుణ్ కుమార్.*
చేవెళ్ల జులై 18(ప్రజాక్షేత్రం): చేవెళ్ల మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయాలని ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్, అరుణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 8214 కోట్లు స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని రంగారెడ్డి జిల్లాలో దాదాపు 730 కోట్లు బకాయి ఉన్నాయని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అన్నారు. ఈ మధ్యన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జేఎన్టీయూలో మాట్లాడుతూ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో విడుదల చేస్తామని చెప్పిన మాటలు చెప్పడం కాదని తక్షణం విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందని అన్నారు పెండింగ్ స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని కళాశాల యాజమాన్యాలు వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయాలని లేని పక్షంలో అసెంబ్లీ ముట్టడిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ చేవెళ్ల మండల నాయకులు సమీర్ చందు నిఖిల్ ఆదిత్య సందీప్ మనీ నవీన్ చరణ్ పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.