దోహా కత్తర్ లో రుణమాఫీ సంబరాలు.
ఆర్మూర్ జులై 19(ప్రజాక్షేత్రం): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ఖాతాల్లో నేరుగా గురువారం రుణమాఫీ నగదు వేయడంతో తెలంగాణ ప్రజలు దోహకత్తర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకం చేసి మిఠాయిలు తినిపించుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు తిర్మాన్ పల్లి ప్రదీప్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అన్న మాట నెరవేర్చుకున్నారని దమ్మున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఇవే కాకుండా 6 గ్యారంటీలలో ఒకటి ఒకటి నెరవేరుస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పింది చెప్పిన విధంగానే చేస్తున్నారు అని రైతుల కష్టాలు చూసే నాయకుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తరుణ్, గొంగటి సూరి, అనిల్, వివేక్,రాజన్న, కళ్యాణ్, అశోక్, యూనిస్ తదితరులు ఉన్నారు.