Praja Kshetram
తెలంగాణ

రుణమాఫీ నిర్ణయం చరితాత్మకమైనది. -యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ గణపురం తరుణ్.

రుణమాఫీ నిర్ణయం చరితాత్మకమైనది.

 

-యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ గణపురం తరుణ్.

 

చేవెళ్ల జూలై 19(ప్రజాక్షేత్రం):కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ అమలును సాధ్యం చేసింది. గురువారం చేవెళ్ల మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ యువ నాయకులు తరుణ్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ అని అన్నారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కృషి చేస్తుందని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల వరకు రుణమాఫీ హామీని కాంగ్రెస్ నెరవేర్చిందని రైతును రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అన్నారు. గత ప్రభుత్వం రుణమాఫీ పేరిట కాలయాపన చేసిందని గుర్తు చేశారు. కానీ ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడని అన్నారు. మొదటి దశలో లక్ష రుణమాఫీ ఉన్న రైతులకు మాఫీ చేస్తూ ఆగస్టు 15 లోపు రెండు లక్షల వరకు రైతుల మొత్తం రుణమాఫీని మాఫీ చేసేందుకు సిద్ధమైందన్నారు. ఒకే దప్పాలో రెండు లక్షల రుణమాఫీ నిర్ణయం చరిత్రత్మకమైనది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయడంతో గ్రామాలలో రైతులు సంబరాలు చేసుకున్నారు. అలాగే ప్రజలకు ఇచ్చిన హామీలను అతి త్వరలోనే నెరవేరుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Related posts