ఇందిరమ్మ రాజ్యంలో రైతును రాజు చేస్తాం.
-శంకర్ పల్లి మండల కేంద్రంలో ఘనంగా రైతు రుణమాఫీ సంబరాలు.
-మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఫోటోలకు క్షీరారాభిశేకం.
-చేవెళ్ల అసెంబ్లీ ఇంచార్జ్ పామెన భీమ్ భరత్.
శంకర్ పల్లి జులై 19(ప్రజాక్షేత్రం): ఇందిరమ్మ రాజ్యంలో రైతును రాజుగా చూడాలనే గొప్ప లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే రైతు రుణమాఫీ పథకమని చేవెళ్ల కాంగ్రెస్ అసెంబ్లీ ఇంచార్జ్ పామెన భీమ్ భరత్ ” అన్నారు. ఆయన ఆధ్వర్యంలో శంకర్ పల్లిలో శుక్రవారం నిర్వహించిన రైతు సంబరాల్లో భాగంగా రైతులతో కలిసి గ్రామంలో సంబరాలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఇంఛార్జి భీమ్ భరత్ మాట్లాడుతూ…కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, వరంగల్ డిక్లరేషన్ ద్వారా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి రూ.2లక్షల రూపాయల రుణమాఫీ చేయడం దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోని సాహసోపేతమైన నిర్ణయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్నారన్నారు. మిగులు బడ్జెట్‌తో తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ అప్పచెబితే కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్‌ఎస్ చేసిన అప్పులు తీర్చుతూ, వడ్డీ కడుతూ రూ.61లక్షల కోట్లతో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలుచేస్తోందన్నారు. అందులో రూ.31వేల కోట్లు రైతులకే వెచ్చించిందన్నారు. సోనియాగాంధీ ఇచ్చిన అభయ హస్తం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ ఆరు నెలల్లో పలు అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రభుత్వం రూ.30వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. మహిళల ఆత్మగౌరవం కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్ సౌకర్యంతో 63కోట్ల మహిళలు ఉచితంగా ప్రయాణించారని, అందుకు ప్రభుత్వం రూ.2,153లక్షల కోట్లు ఆర్టీసీకి కేటాయించిందన్నారు. 40లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చేందుకు రూ.168కోట్లు ఖర్చు చేసిందన్నారు. గృహజ్యోతి పథకం ద్వారా ప్రతీ ఇంటికి 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్‌ను 46లక్షల మందికి ఇచ్చేందుకు రూ.168కోట్లను ప్రభుత్వం కేటాయించిందన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి రూ.680కోట్లు చెల్లించగా, 40లక్షల మంది లబ్ధి పొందారన్నారు. ఆగస్టు 15 లోగా రూ.2లక్షల రుణమాఫీ ఏక కాలంలో అవుతుందన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ని అధిక సంఖ్యలో సీట్లు సాధించుకోవాలని,అభివృద్ది చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి ఉదయ్ మొహన్ రెడ్డి చేవెళ్ల అసెంబ్లీ ఇంచార్జ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెంటారెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, మాజీ ఎం పిపి నర్సింలు,రవీందర్ రెడ్డి, యాదయ్య, ప్రశాంత్, శ్రీనివాస్ రెడ్డి, రాజేష్ గౌడ్, శేఖర్ రెడ్డి, శంకర్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.