ఫత్తేపూర్ 8వ వార్డులో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం.
శంకర్ పల్లి జులై 19(ప్రజాక్షేత్రం): పురపాలక సంఘం శంకర్ పల్లి పరిధిలో శుక్రవారం దోమల నివారణకు మరియు సీజనల్ వ్యాధుల నివారణకై ఫ్రైడే డ్రై డే కార్యక్రమం ఫతేపూర్ వార్డు యందు నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, వార్డు కౌన్సిలర్ జోన్నాడ రాములు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, మేనేజర్ అంజన్ కుమార్, టీఎంసీ అనూష, వార్డ్ ఆఫీసర్లు, ఆశా వర్కర్లు మరియు వార్డు ప్రజలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.