ఇప్పటికీ రైతుల కళ్ళల్లో ఆనందం వెలకట్టలేనిది
-రైతన్నల రుణం తీర్చుకునేందుకే కాంగ్రెస్ పార్టీ.
-కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ పొద్దుటూరి విన్నర్ రెడ్డి.
-రైతుల కళ్ళల్లో ఆనందం చూడడానికే ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్.
ఆర్మూర్ జులై 19(ప్రజాక్షేత్రం):నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో శుక్రవారం అంబేద్కర్ చౌరస్తా వద్ద పలు నేతలకు కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి సన్మానించారు. ఈరవత్రి అనిల్, మానాల మోహన్ రెడ్డి లను శాలువాలతో సత్కరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నినాదాలు చేశారు ఇట్టి సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్మూర్ వచ్చినప్పుడు అంబేడ్కర్ చౌరస్తాలో సిద్ధులగుట సాక్షిగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాలోకి వేయడం జరిగిందని ఆయన తెలిపాడు. ఈరోజు రైతుల కళ్ళల్లో ఆనందం చూడడానికి ముఖ్యకారకులు సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు.బ్యాంకు వద్దకు వెళ్లి రైతులు వారి యొక్క ఖాతాను చెక్ చేసుకొని నగదు తీసుకుంటున్నారని తెలిపారు. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల తరపున రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు.