Praja Kshetram
తెలంగాణ

మొయినాబాద్ – వేంకటాపూర్ రోడ్డుకు మోక్షం ఎన్నడో ?

మొయినాబాద్ – వేంకటాపూర్ రోడ్డుకు మోక్షం ఎన్నడో ?

 

-ప్రభుత్వాలు మారిన పరిషానులో వాహనదారులు.

-అడుగడుగున గుంతల మయం.

-చినుకు పడితే చిత్తడే వాహనదారులకు నరకయాతన.

-అయినా పట్టించుకోని పాలకులు.

-ఎస్టిమేషన్లతో తాత్సారం చేస్తున్న అధికారులు.

మొయినాబాద్ జూలై 19(ప్రజాక్షేత్రం):గత కొన్ని ఏండ్లుగా పాలకులు మారిన పరిస్థితి పాతదే అన్నట్లుగా ఉంది మొయినాబాద్ నుంచి వెంకటాపూర్ రోడ్డు దుస్థితి. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి గుంతల ఆవల ఉన్న ఊర్లలోని ఓట్లు కనపడతాయే తప్ప గుంతల మయంగా మారిన రోడ్లు కనిపించకపోవడం సిగ్గుచేటు. అన్నీ బాగుంటే కెవ్వలం 10నుంచి15 నిమిషాల వ్యవధిలో చేరుకునే వెంకటాపూర్ – మొయినాబాద్ రహదారి కాస్తా గతుకుల మయంగా మారడంతో పది నిమిషాల తోవ్వ కాస్తా గంట సమయం పడుతుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యం బాగా లేకపోయినా అత్యవసరం ఎదురైన ప్రాణ సంకటంగా మారిన ఈ రోడ్లపై ప్రయాణం చేయక తప్పని పరిస్థితి ఎదురవుతుందని శ్రీరామ్ నగర్ వెంకటాపూర్ సురంగల్ గ్రామస్తులు నాయకుల పనితీరుపై ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. ఈ మార్గం గుండా నిత్యం వెళ్ళే ప్రయాణికులు వెన్నునొప్పి సమస్యలను ఎదుర్కొంటున్నామని, వీలైనంత తొందరగా రోడ్ల సమస్యను తీర్చకపోతే గెలిచిన నాయకులు స్థానిక ఎన్నికల్లో మూల్యం చెల్లించక తప్పదని ఆయా గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. ప్రసవానికి బయలుదేరిన గర్భిణీలు ఈ రోడ్ల గుండా ప్రయాణం చేయాల్సిరావడంతో అనుకున్న ఆస్పత్రికి చేరక ముందే మార్గమధ్యలో ఎమర్జెన్సీ కోసం ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకోవడం గమనాహరం. నిత్యం వందలాదిమంది విద్యార్థులు వెళ్లే ఈ మార్గంలో బస్సులు సైతం లేకపోవడం నాయకుల పనితీరుకు నిదర్శనం. వాహనదారులు వారానికోసారి మెకానిక్ షెడ్కు తీసుకెళ్లాక తప్పడం లేదని రిపేర్ల పేరిట జేబులు ఖాళీ అవుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. అయితే ఇది ఇలా ఉంటే రోడ్ల వేసేందుకు ముందుకు వచ్చిన వారిని బడ్జెట్ లేదంటూ భాజాప్త చెప్పి ఎస్టిమేషన్లతోనే కాలం గడుపుతున్నారు సంబంధిత ఆర్ అండ్ బి అధికారులు. చినుకు పడితే చిత్తడిగా మారే ఈ రోడ్లను బాగు చేసే మోక్షం ఎప్పుడోనని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఎస్టిమేషన్లను పరిశీలించి మొయినాబాద్ -వెంకటాపూర్ బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రణికలు డిమాండ్ చేస్తున్నారు.

Related posts