Praja Kshetram
తెలంగాణ

కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీని అమలు హర్షణీయం.

కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీని అమలు హర్షణీయం.

 

-జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చిన్నా ముదిరాజ్.

 

పటాన్ చెరువు జులై 19ప్రజాక్షేత్రం):కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో అన్నదాతలు ఆనందంలో మునిగి తేలారాన్నారు సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చిన్నా ముదిరాజ్. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రుణమాఫీని అమలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ రైతు సంరక్షణ సమితి అధ్యక్షులు రాష్ట్ర సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామంటే హేళన చేసిన బిఆర్ఎస్ నేతలు, ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా పత్రం సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. గత బీ ఆర్ ఎస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లో పూర్తిగా విఫలమయ్యారు. రాహుల్ గాంధీ వరంగల్ సభలో రైతుల పక్షాన రుణమాఫీ చేస్తా అన్నారు. నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయడం జరిగిందన్నారు. హరీష్ రావు రాజీనామా చేయడంతో పాటు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయననే మాటకు కట్టుబడి ఉండాలని సవాల్ విసిరారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నామని విడతల వారిగా ఆగష్టు 15 లోగా రైతుల రెండు లక్షల వరకు పంటరుణం మాఫీ అవుతుందని స్పష్టం చేశారు. ఎక్కడ ఎప్పుడు లేని విధంగా దేశంలోనే తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే రోజు 7000 కోట్లు 11లక్షల 50 వేల మంది రైతులకు లక్షలోపు రుణంమాఫీ చేసి ఆ మొత్తాన్ని రైతులు బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ సంబరాల్లో రైతులతో కలిసి కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు సంబరాలుచేసుకున్నారు. గ్రామ గ్రామాన రైతు వేదికల వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు.

Related posts