సర్కారు మారిన సరికాని రోడ్డు…!
-అధ్వానంగా మారిన చనిగేష్ పూర్- తాండూరు రోడ్డు.
-తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు.
తాండూరు జులై 19(ప్రజాక్షేత్రం): తాండూరు కోనాపూర్ రోడ్డు మార్గంలో గుంతలు ఏర్పడ్డాయని ఇది వర్షాకాలం కావడంతో ఆ గుంతలలో నీళ్లు నిండి ఇంకా రోడ్డు పాడైపోయిందని దీనివలన ముఖ్యంగా ఆ మార్గం లో ప్రయాణించే చెంగేస్పూర్, కోనాపూర్, ఎల్ మే కన్య గ్రామాలకు చెందిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు ఈ రోడ్డు గత కొన్ని సంవత్సరాలుగా ఇలాగే ఉందని గత ప్రభుత్వ నాయకులకు చెప్పిన పట్టించుకోలేదని వారు తెలిపారు ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారులను వారు సంప్రదించామని తెలిపారు. కనీసం ఈ ప్రభుత్వంలో అయినా రోడ్డు మరమ్మతు పనులు సత్వరంగా పూర్తి చేసి తమని ఈ ఇబ్బంది నుంచి బయటపడేయాలని వారు కోరడం జరిగింది.