Praja Kshetram
క్రైమ్ న్యూస్

టీ స్టాల్‌లో మంటలు..!

టీ స్టాల్‌లో మంటలు..!

-ఆర్పేసిన ఫైర్ సిబ్బంది.

-తాండూరు పట్టణంలో ఘటన.

తాండూరు జులై 20(ప్రజాక్షేత్రం):టీ స్టాల్‌లో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటన తాండూరు పట్టణ శివారులో జరిగింది. కోడంగల్ రోడ్డు మార్గం రసూల్ పూర్ సమీపంలో ఎల్లో టీ స్టాల్ కొనసాగుతోంది. శనివారం ఉదయం టీ స్టాల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. షాక్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు స్టాల్ మొత్తం వ్యాపించాయి. గమనించిన నిర్వహకులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. వెంటనే తాండూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ఈ అగ్ని ప్రమాదంలో యజమానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts