ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హత్యకి కుట్ర..కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక.
అమరావతి జులై 20 (ప్రజాక్షేత్రం):జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి ఎన్నికలలో గేమ్ చేంజర్‌గా మారి కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అంతేకాదు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో అఖండ విజయం సాధించారు. అంతేకాకుండా ఆయన పార్టీ నుండి పోటీ చేసిన 20 మంది గెలిచారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎంతో పాటు పలు పదవులు అందుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయ పనులలో చాలా బిజీగా ఉన్నారు. అయితే ఆయనకు తాజాగా కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతోందని.. కాస్త అప్రమత్తంగా ఉండమంటూ నేరుగా ఆయనకే కేంద్ర నిఘా వర్గాలు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో అటు అభిమానుల్లో, కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది.మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి.పూర్తి వివరాలు వెల్లడించలేం కానీ జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్ర నిఘా వర్గాలు నేరుగా ఆయనకు సూచనలు చేయడం రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. కేంద్ర ఇంటెలిజెన్స్ లోని కొందరితో మాట్లాడినప్పుడు లేదా రెగ్యులర్ ట్రాకింగ్ లో కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావవ వచ్చినట్టు తెలిసిందని కేంద్ర నిఘా వర్గాలు చెప్పుకొచ్చాయి. కేంద్ర ఇంటిలిజెన్స్ అధికారులు కొందరు కాల్స్ ట్రాకింగ్ చేసినప్పుడు కొందరి మధ్య పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన ప్రస్తావన వచ్చిందని నిఘా వర్గాలు ఆయనకు హెచ్చరించినట్లు తెలుస్తోంది. కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావవ వచ్చినట్టు తెలిసిందని కేంద్ర నిఘా వర్గాలు తెలిపాయి.గ్రూపులు ఎవరివనే విశ్లేషణ చేసినప్పుడు కొన్ని ఆసక్తికరమైన, ఆందోళన కల్గించే అంశాలు వెలుగుచూశాయి. ఈ అంశాల కారణంగానే పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరగవచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అందుకే ఆయనని జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు పంపినట్టు తెలుస్తుంది. కాగా, పవన్ కళ్యాణ్ ఈ మధ్య ప్రధాని నరేంద్ర మోదీకు సన్నిహితంగా మారడంతో పాటు ఎన్డీఏ కూటమి ఏపీలో, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో వచ్చేందుకు కారణం అయ్యారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ వ్యతిరేఖ శక్తులు పవన్ కల్యాణ్‌ని టార్గెట్ చేశారా అన్న భావన కొందరిలో కలుగుతుంది.