Praja Kshetram
క్రైమ్ న్యూస్

మాజీ ఎమ్మెల్యే కారు ఢీకొని మహిళ మృతి.. వాహనం వదిలి వెళ్లిపోయిన రాజయ్య.

మాజీ ఎమ్మెల్యే కారు ఢీకొని మహిళ మృతి.. వాహనం వదిలి వెళ్లిపోయిన రాజయ్య.

 

 

హనుమకొండ జులై 20(ప్రజాక్షేత్రం): స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య కారు ఢీకొని ఓ మహిళ మృతిచెందింది. కాజీపేట మండలం మడికొండ వద్ద కలకోట్ల స్వప్న అనే మహిళ రోడ్డు దాటుతుండగా.. వేగంగా వచ్చిన రాజయ్య కారు ఆమెను ఢీకొట్టింది. బలంగా కారు ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదం తర్వాత కారు దిగిన మాజీ ఎమ్మెల్యే.. బాధితురాలిని చూసి అక్కడ్నుంచి వెళ్లిపోయారు. అనంతరం కారును కాజీపేట బాపూజీనగర్‌లో వదిలేసి మాజీ ఎమ్మెల్యే వెళ్లిపోయారు. అయితే కారు నడిపింది మాజీ ఎమ్మెల్యే రాజయ్యనా లేక డ్రైవరా అన్నది ఇంకా తెలియరాలేదు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.

Related posts