గాయకుడు జయరాజ్ కు మెల్డ్ బ్రెయిన్ స్ట్రోక్.
హైదరాబాద్ జులై 20(ప్రజాక్షేత్రం): ప్రముఖ కవి, గాయకుడు జయరాజ్ మెల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చేర్చించారు. ఐసీయూలో డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తున్నది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన జయరాజ్ సమాజంలోని వివక్ష, అణచివేత, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో తనదైన ఆటపాటల ద్వారా పల్లెల్లో తిరుగుతూ ఉద్యమ భావజాలాన్ని పెంపొందించారు. ప్రకృతికి, మనిషికి ఉన్న అవినాభావ సంబంధాన్ని వివరిస్తూ ఆయన రాసి పాడిన అనేక పాటలు ఇప్పటికే ప్రజల నోళ్లలో నానుతూ నే ఉన్నాయి. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో జయరాజ్ చేసిన కృషికిగాను తెలంగాణ ప్రభుత్వం 2023లో కాళోజీ నారాయణ రావు అవార్డును అందజేసింది.