Praja Kshetram
తెలంగాణ

శంకర్ పల్లి సాయిబాబా ఆలయంలో కనుల పండుగగా గురు పౌర్ణమి.

శంకర్ పల్లి సాయిబాబా ఆలయంలో కనుల పండుగగా గురు పౌర్ణమి.

 

-ప్రత్యేక పూజలు చేసిన శంకర్ పల్లి మున్సిపల్, వైస్ చైర్మన్ వెంకట్ రామిరెడ్డి దంపతులు.

శంకర్ పల్లి జులై 21(ప్రజాక్షేత్రం): తొలి ఏకాదశి ఉత్తరాయణ కాలం నుండి దక్షిణాయన పుణ్యకాలంలోకి ప్రవేశించిన వేళ ఆధ్యాత్మిక వారసత్వాన్ని నేర్పిన కృష్ణ ద్వైపాయనుడైన వేద వ్యాసుడు మహాముని పుట్టినరోజును, గురు పౌర్ణమిగా కొలుస్తూ భారతదేశంలోని భక్తులందరూ తమ ఆధ్యాత్మిక గురువులైన దత్తాత్రేయ స్వామిని, రాఘవేంద్ర స్వామిని, వ్యాస మహర్షిని పూజిస్తూ.., భగవద్గీత సారాంశాన్ని వంటబట్టించుకొని బ్రతికి మానవాళికి సమత, మమత, ప్రేమ, దయాళుత్వము లాంటి మంచి సద్గుణాలను నేర్పిన శ్రీ షిరిడి సాయిబాబాను ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ సందర్భంగా ఆదివారం శంకర్ పల్లి మున్సిపల్ పరిధి సాయి కాలనీలో గల, సాయిబాబా ఆలయంలో, శ్రీ శిరిడి సాయినాధునికి శంకర్ పల్లి వైస్ చైర్మన్ వెంకట్ రామ్ రెడ్డి దంపతులు, ఉపవాస దీక్షలో ఉండి ఆవు నెయ్యితో దీపారాధన చేసి, సాయినాథునికి ఇష్టమైన పసుపు తెలుపు రంగు పువ్వులతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు సాయినాథునికి , ప్రత్యేక గీతాలు ఆలాపించి ,భజనలు చేసి శ్రీ షిరిడి సాయినాథుని కృప పాత్రులై తరించారు. గురు పౌర్ణమి ని పురస్కరించుకొని వచ్చిన భక్తులందరికీ, శంకర్ పల్లి మున్సిపాలిటీ, వైస్ చైర్మన్ వెంకట్ రామిరెడ్డి దంపతులు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శంకర్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఏనుగు రవీందర్ రెడ్డి, ఆంధ్ర ప్రభ రిపోర్టర్ రవి, వివిధ పార్టీల నాయకులు ప్రజలు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts