బీసీ డిక్లరేషన్ హామీ అమలు చేయాలని నిరసన
-తాసిల్దార్ కు వినతి పత్రం అందజేస్తున్న భాజపా నేతలు….
మొయినాబాద్ జూలై 23(ప్రజాక్షేత్రం) : అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిసి డిక్లరేషన్ పేరట కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని మండల ఓబిసి అధ్యక్షులు అశోక్ యాదవ్ విమర్శించారు. బీసీ డిక్లరేషన్ అమలు కోరుతూ మంగళవారం ఓబిసి మోర్చా ఆధ్వర్యంలో మొయినాబాద్ తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్నెల్లలోపే కులగణనను చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లను పెంచుతామన్న హామీ అమలు కాలేదన్నారు. భాజపా ఓబిసి జిల్లా మూర్చ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రెండవ దశ గొర్రెల పంపిణీకి సంబంధించిన రెండు లక్షల చొప్పున లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో వేస్తామని హామీని విస్మరించారని పేర్కొన్నారు. తాసిల్దార్ గౌతమ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ ముచ్చ లక్ష్మీనారాయణ, బిజెపి మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రకాష్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి నరసింహ రెడ్డి, జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఓబీసీ కార్యదర్శి వెంకటేష్ గౌడ్, మోకిల వెంకటేష్ బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.