పరిశ్రమలో ప్రమాదం, మృతి చెందిన కార్మికుడు.
పరవాడ జూలై 23 (ప్రజాక్షేత్రం):పరవాడ మండలం జవహర్ లాల్ నెహ్రు ఫార్మా సిటీ స్మైల్ఎక్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఒడిస్సా రాష్ట్రానికి చెందిన కబీ రాజ్ సాహు మృతి చెందాడు. ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వలనే కార్మికుడు మృతి చెందినట్లు ఫార్మాసిటీ స్టెప్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ ఆరోపించారు. భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పటి వరకు ఈ పరిశ్రమలో మూడు భారి ప్రమాదాలు జరిగినట్లు తెలిపారు. కార్మిక కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని పరిశ్రమ యాజమాన్యాన్ని గనిశెట్టి డిమాండ్ చేశారు.