ఫ్రెండ్లీ పోలీస్ పని తీరు ఇదేనా..?
-చేవెళ్ల ట్రాఫిక్ సిఐ వీరంగం.
-ఓ పౌరుడిపై బూటికాలితో దాడి.
-కోపాన్ని కంట్రోల్ చేసుకోని సిఐ వెంకటేశం.
-అదే మూర్ఖత్వంతో కానిస్టేబుల్.
చేవెళ్ల జులై 25(ప్రజాక్షేత్రం): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులను బాధితులతో పెండ్లి పోలీస్ గా మూవ్ అవ్వాలని తెలిపిన సంగతి మీకు తెలిసింది. కానీ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ట్రాఫిక్ సిఐ చేసిన వీరంగం అంతో ఇంతో లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుకుంటే చలానా వేసి విడిచి పెట్టాలి లేదా కోర్టుకు హాజరుపరచాలి గాని వాహనదారుల పైన వీరంగం చూపించాడు ఓ ట్రాఫిక్ సిఐ.చేవెళ్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన సీఐ వెంకటేశం కోపాన్ని కంట్రోల్ చేసుకోకుండా ఓ పౌరుణ్ణి తన బూటూకాలితో తన్నుతూ చెంపల పైన కొడుతూ బండ బూతులు తిడుతూ గుంజుకెల్లాడు. అదే మూర్ఖత్వంతో కానిస్టేబుల్ కూడా వారిపై దురుభాషతో మాట్లాడుతూ వారిపై దాడి చేశారు. మద్యం మత్తులో ఉన్న డ్రంక్ అండ్ డ్రైవర్లను ఇష్టం వచ్చినట్టు పోలీసులు ప్రవర్తించాడు. ఇది చూసిన నెటిజన్లు ఫ్రెండ్లీ పోలీస్ అనే పేరుతో వాహనదారులను ప్రజలను బాధితులను హింసిస్తున్నారు అని అంటున్నారు.