Praja Kshetram
తెలంగాణ

శంకర్ పల్లిలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం.

శంకర్ పల్లిలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం.

 

శంకర్ పల్లి ఆగస్టు 01(ప్రజాక్షేత్రం):మాజీ హోంశాఖ, మాజీ విద్యాశాఖ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శంకర్ పల్లిలో గురువారం బిఆర్ఎస్ నాయకులు సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అంతకుముందు శంకర్ పల్లి ఇంద్రారెడ్డి చౌరస్తాలో టిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున రాస్తారోకో ధర్నా చేసేందుకు సన్నద్ధం కాగా శంకర్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ హబీబుల్లాఖాన్ ఆధ్వర్యంలో వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. కొందరు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆకస్మాత్తుగా శంకర్ పల్లి చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేస్తుండగా అక్కడే ఉన్న పోలీసులు ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకుడు లక్ష్మీనరసింహారెడ్డి మరి కొంతమంది టిఆర్ఎస్ యూత్ నాయకులు టిఆర్ఎస్వి నాయకులు ముందు వేసుకున్న ప్రణాళిక ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడంలో సఫలీకృతులయ్యారు. దిష్టిబొమ్మ దగ్ధం అంతా సినిమా పక్కిలో జరిగినట్లు కనిపిస్తోంది. పోలీసులు చౌరస్తాలో పహారా కాస్తున్నప్పటికీ బిఆర్ఎస్ యూత్ బిఆర్ఎస్ విద్యార్థి నాయకులు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం పట్ల పోలీసులు సైతం కంగుతిన్నారు.

Related posts