Praja Kshetram
తెలంగాణ

జాతీయ సమైక్యతాభావం పెంచాలి.

జాతీయ సమైక్యతాభావం పెంచాలి.

 

 

మొయినాబాద్ ఆగస్టు 15(ప్రజాక్షేత్రం):యువతలో జాతీయ సమైక్యత భావాన్ని పెంపొందింపజేయాలని అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మనుక ప్రవీణ్ కుమార్, మాజీ సర్పంచ్ సనువెళ్లి ప్రభాకర్ రెడ్డి అన్నారు. మొయినాబాద్ మండలంలోని శ్రీరాంనగర్ గ్రామంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని మనం పీల్చే స్వేచ్ఛ వాయువుల వెనుక ఎంతోమంది ప్రాణదానం ఉంది. మన స్వాతంత్ర దినోత్సవాన్ని చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించారు. ఎంతోమంది భరతమాత బిడ్డలు తమ ఆయువును త్యాగం చేసి భరతమాతకు స్వేచ్ఛను అందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశము ఉంది. 1947 భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకోవడానికి ఎంతోమంది మహనీయులు పోరాటం చేశారు. ప్రతి ఏడాది ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించకున్న ప్రతిసారి త్యాగదనులను అందరం ఒకసారి గుర్తుంచుకోవాల్సిందే అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పట్నం రాంరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ మైపాల్, మాజీ వార్డు సభ్యులు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Related posts