కేఎన్ఆర్ స్కూల్లో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
మొయినాబాద్ ఆగస్టు15(ప్రజాక్షేత్రం) : మొయినాబాద్ మండలంలోని కెఎన్ఆర్ హైస్కూల్ లో 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా విద్యార్థులు నృత్యాలు వివిధ రకాల స్కిట్లను ప్రదర్శించారు. కేఎన్ఆర్ కరస్పాండెంట్ నరసింహారెడ్డి ప్రిన్సిపల్ సూర్య కళ రెడ్డి ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేటర్ సింగయ్య మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల గురించి మరియు వారి త్యాగాలను వెలకట్టలేమని విద్యార్థులకు వివరించారు. మనుషులు పుడుతారు చనిపోతారు కానీ కొందరు మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు తమ జీవితాన్ని పణంగా పెట్టి మానవజాతి ఉన్నత వరకు చిరస్థాయిగా తెలిసిపోతాయి వీరిని మృతుంజీవులు అని కోటాను కోట్ల జన్మలో బౌకొద్దిమంది మాత్రమే ఇలాంటివారు ఉంటారని స్వాతంత్రం కోసం తమ ప్రాణాల సైతం లెక్కచేయకుండా పోరాడిన యోధులు గురించి ఆగస్టు 15న భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఓసారి స్మరించుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా విద్యార్థులు దిశ నుంచి నాయకత్వంలో అక్షరాలను అలవర్చుకోవాలని దేశ అభివృద్ధి కోసం భవిష్యత్తులో ప్రధాన పాత్ర పోషించాలని చదువుతోపాటు అన్ని రంగాల్లో విద్యార్థులందరూ కలిసికట్టుగా ముందుండాలని మన దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులను స్మరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కేఎన్ఆర్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు డి సింగయ్య ఉపాధ్యాయులు సుజాత, సునీత, కరుణ, ప్రమీల, సబిత, అస్మ, అనూష, ఉమా, దివ్య, సునీత, ఉన్నిస, ముస్కాన్, సాయినాథ్ రెడ్డి, గోపాల్ పిఈ టి, భార్గవి, శ్వేత, శ్రీరామ్,విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.