Praja Kshetram
ఆంధ్రప్రదేశ్

గాండ్ల, తెలికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జెండా వందనం.

గాండ్ల, తెలికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జెండా వందనం.

 

విశాఖపట్నం ఆగస్టు 15(ప్రజాక్షేత్రం):గాండ్ల, తెలికుల సంక్షేమ సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు,డాక్టర్ దాడి సత్యనారాయణ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్, డాక్టర్ పెబ్బిలి రవికుమార్ ఆధ్వర్యంలో, 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు..జగదాంబ జంక్షన్ లో గల సంఘం కార్యాలయం వద్ద జరిగిన వేడుకల్లో దాడి సత్యనారాయణ చేతులమీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు అనంతరం జెండా వందనం స్వీకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్య కోసం ప్రాణత్యాగం చేసిన సమరయోధులను గుర్తు చేసుకొని వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని, దేశభక్తి భావాన్ని చాటుతూ భావితరాలు ఆ దిశగా నడిచేలా సమిష్టిగా కృషి చేద్దాం తెలియజేసారు..ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు.. ఈ సమావేశంలో కన్వీనర్ ఎన్ఐటి తాతారావు , కార్యదర్శులు చిత్రాడ అప్పారావు , పేరూరి గణేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

Related posts