చంపేస్తా…! అంటూ ఎస్ ఐ బెదిరింపులు.
-ప్రేమించిన యువతితో కొడుకు పరార్… తల్లికి చిత్రహింసలు.
-బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఘటన.
తాండూర్ ఆగస్టు 16( ప్రజాక్షేత్రం) : వివరాల్లోకి వెళితే వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నవల్గా గ్రామానికి చెందిన నరేష్( 17), ఓ బాలిక (16) ప్రేమించుకుని మే 2న వారు ఇరువురు పారిపోయారు అయితే ఇట్టి విషయమై అబ్బాయి మీద బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదు అయింది. ఇది ఇలా ఉండగా అబ్బాయి తల్లిని విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ కు పిలిచే మూడు నెలల నుంచి చిత్ర అంశాలు చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చింది. ముఖ్యంగా దెబ్బల వల్ల చేతులు, కాళ్లు బాగా వాచిపోయాయి అని, తన కుమారుడు ఎక్కడ ఉన్నాడో ఆచూకీ చెప్పకపోతే గన్ తో కాల్చి చంపేస్తానంటూ స్టేషన్ ఎస్ ఐ రమేష్ బెదిరించాడని దళిత మహిళ కళావతి పేర్కొంది. విషయం బయటికి తెలియడంతో ప్రజా సంఘం నాయకులు బాధితురాలికి న్యాయం చేయాలని అందులోనే చేశారు. అయితే ఈ విషయం తనవరకు రాలేదని సిఐ అశోక్ చెప్పుకొచ్చారు. విచారణ జరిపి న్యాయం జరిగేలా చూస్తానని ఆయన అన్నారు.