Praja Kshetram
తెలంగాణ

ఛత్రపతి శివాజీ ఆదర్శనీయుడు.

ఛత్రపతి శివాజీ ఆదర్శనీయుడు.

 

 

మోమిన్‌పేట్‌ ఆగస్టు 25 (ప్రజాక్షేత్రం): ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అందరికీ ఆదర్శమని, ఆయన చివరి రక్తం బొట్టు వరకూ హిందూ సమాజం కోసం పరితపించిన మహోన్నత వ్యక్తి అని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మోమిన్‌పేట్‌ మండలంలోని మేకవనంపల్లి గ్రామంలో శివాజీ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాజీ తన చివరి రక్తం బొట్టు వరకూ హిందూ సామ్రాజ్యం కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. ప్రతీ ఒక్కరూ శివాజీని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కో ఆర్డినేటర్‌ వడ్ల నందు, నాయకులు శ్రీధర్‌రెడ్డి, ఆశిరెడ్డి, భుజంగరెడ్డి, విగ్రహం, స్థల దాత రామచంద్రారెడ్డి, వెంకట్‌రెడ్డి, గోవర్ధన్‌, సంగారెడ్డి, రామకృష్ణారెడ్డి, శివాజీ యూత్‌ అసోసియేషన్‌ సభ్యులు, పలు గ్రామాల హిందూ సంఘాల సభ్యులు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts