రాష్ట్రపతి గ్యాలంటరీ మెడల్ కి ఎన్నికైన ఒకే ఒక్కడు హెడ్ కానిస్టేబుల్ చదువుల యాదయ్య
-స్వగ్రామం మిర్జాగూడలో ఘనంగా సన్మానం
-శాసనసభ్యులు కాలే యాదయ్య.
చేవెళ్ల ఆగస్టు 25(ప్రజాక్షేత్రం): రాష్ట్రపతి గ్యాలంటరీ మెడల్ కి ఎంపికైన హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు తన స్వగ్రామం మిర్జాగూడ గ్రామంలో స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య,పెద్దలు, యువకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ పోలీస్ కానిస్టేబుల్ యాదయ్య తన ప్రాణాలను లెక్క చెయ్యకుండా విధి నిర్వహణలో దొంగలను పట్టుకొన్న విషయాన్ని గుర్తుచేస్తూ యాదయ్యకు సేవలు అభినందనియం అన్నారు. పోలీసు శాఖలో ఇలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. అని గుర్తు చేశారు తన ధైర్య సాహసాలను మెచ్చుకోవాలి అన్నారు, మిర్జాగూడ గ్రామం నుండి ఏకంగా రాష్ట్రపతి శౌర్య పతాకానికి ఎన్నిక కావడం నా నియోజకవర్గం నుండి ఎన్నికైనందుకు చాలా గర్వపడుతున్నాను. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార జాయింట్ కన్వీనర్ సున్నపు వసంతం,మాజీ మాజీ జెడ్పిటిసి మాలతి కృష్ణారెడ్డి, మండల నాయకులు అగిరెడ్డి దేవర వెంకట రెడ్డి, అనంత్ రెడ్డి, వైభవ్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.