హైడ్రా వెనక ఎలాంటి రాజకీయ కుట్ర లేదు.
-అందరి నోట శభాష్ అనిపించుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి.
-రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు జ్యోతి భీమ్ భరత్.
శంకర్ పల్లి ఆగస్టు 25(ప్రజాక్షేత్రం): హైడ్రా వెనక ఎలాంటి రాజకీయ కుట్ర లేదని రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు జ్యోతి భీమ్ భరత్ అన్నారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ హైడ్రాకు చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ ఉండడం తెలంగాణ రాష్ట్రం మేలుకోసమే అని తెలిపారు. ప్రభుత్వ భూముల రక్షణ పేరిట మొదలైన హైడ్రా చేసే పనులు మంచివే అన్నారు. హైదరాబాదులో చెరువులను చెరబట్టిన వాళ్ల నుంచి వాటిని హైడ్రా ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం విముక్తి చేస్తుందని వెల్లడించారు. చెరువులను ఆక్రమించిన వారిని సీఎం రేవంత్ రెడ్డి వదలరని పేర్కొన్నారు. ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గరని తెలిపారు. అక్రమ నిర్మాణాలన్నింటిని హైడ్రా కూల్చి వేస్తుందని ఆమె తెలియజేశారు. చెరువు పరిధిలో ఉన్న కట్టడాలను కూల్చేసి సీఎం రేవంత్ రెడ్డి, రంగనాథ్ అందరి నోట శభాష్ అనిపించుకుంటున్నారని జ్యోతి భీమ్ భరత్ తెలియజేశారు. అక్రమ నిర్మాణాలు చేసిన వ్యక్తులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉండొచ్చు. ప్రభుత్వంలోనూ ఉండొచ్చు. అక్రమ నిర్మాణాలు ఎవరు చేసినా హైడ్రా కూల్చి వేస్తుందని, చెరువులు మన జీవనాధారం, సంస్కృతి. వాటిని కాపాడటం ఎంతో కీలకం. భవిష్యత్ తరాలకు వాటిని అందించాలి’ అని సీఎం ఆకాంక్షించారని తెలిపారు. చెరువుల కోసం ఎంతటి వారైనా సరే వారి భరతం పడతారని సీఎం స్పష్టం చేశారని జ్యోతి బీమ్ భరత్ తెలిపారు.