Praja Kshetram
క్రైమ్ న్యూస్

ఏసీబీ వలలో ట్రాన్స్ కో డీఈ హుస్సేన్ నాయక్.

ఏసీబీ వలలో ట్రాన్స్ కో డీఈ హుస్సేన్ నాయక్.

 

–రైతు నుంచి రూ.20వేలు లంచం డిమాండ్‌.

–రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.

స్టేషన్ ఘనపూర్ ఆగస్టు 31(ప్రజాక్షేత్రం): రైతు నుంచి రూ.20వేలు లంచం తీసుకుంటూ విద్యుత్‌శాఖ డీఈ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా శనివారం పట్టుబడ్డాడు. మండలకేంద్రంలోని కుంభం ఎల్లయ్య అనే రైతు తన వ్యవసాయ భూమిలోని 33 కేవీ విద్యుత్తు లైన్ మార్చడానికి రెండున్నరేళ్ళుగా విద్యుత్తు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. విద్యుత్తు శాఖ అధికారుల సూచన, నిబంధనల మేరకు రూ. 16లక్షల డీడీ తీశారు. డీడీ చెల్లించినప్పటికీ సదరు డీఈ 3నెలలుగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ, పనులు నిలిపివేసినట్లు బాధితుని కుమారుడు కుంభం రాజు తెలిపారు. రూ.20వేలు లంచం ఇస్తేనే విద్యుత్‌ టవర్స్, విద్యుత్తు లైన్ ఒక పక్కకు మార్చుతామని డీఈ హుస్సేన్ నాయక్ తేల్చిచెప్పాడు. అంత డబ్బు ఇవ్వలేనని రైతు బతిమాలినా వినలేదు. రూ.20వేలకు రూపాయి తగ్గినా సమస్యను తీర్చమని స్పష్టం చేశాడు. దీంతో రైతు ఎల్లయ్య కుమారుడు రాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పక్కా ప్రణాళికతో శనివారం స్థానిక డివిజనల్ ఇంజనీర్ ఆపరేషన్ కార్యాలయంలోరైతు రాజు నుంచి రూ.20వేల లంచం తీసుకున్నాడు. అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ దాడిలో ఏసీబీ డీఎస్పీ సాంబయ్య, ఇన్స్పెక్టర్లు ఎస్. రాజు, ఎల్. రాజు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే 1064కు టోల్ ఫ్రీ కి సంప్రదించవచ్చని ఏసీబీ అధికారులు తెలిపారు.

Related posts