Praja Kshetram
తెలంగాణ

అన్నంలో పురుగులు వస్తున్నాయి..

అన్నంలో పురుగులు వస్తున్నాయి..

 

-విద్యార్థినిల ఆవేదనలు.

-విద్యార్థినిల సమస్యలఫై అసెంబ్లీలో లేవనెత్తుతా.

-పాలమాకుల గురుకుల పాఠశాలను సందర్శించిన హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి.

శంషాబాద్ ఆగస్టు 31(ప్రజాక్షేత్రం): అన్నంలో పురుగులు వస్తున్నాయని చెబితే మమ్మల్ని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాలమాకుల గురుకుల విద్యార్థినిలు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాలమాకుల గురుకుల పాఠశాలను శనివారం టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. ఇందులో భాగంగా గురుకుల పాఠశాల విద్యార్థినులు వారి ముందు తమ గోడు వెళ్ళబోసుకొని వెక్కి వెక్కి మరీ ఏడ్చారు. అంతేకాకుండా రోజు ఐదు లీటర్ల పాలు పక్కన పెట్టుకుని రోజంతా ఉపాధ్యాయులు చాయ్ తాగుతారని బాలికలు చెబుతున్నారు. అంతేకాదు ఉపాధ్యాయులు సమయానికి రాకుండా 12 గంటలకు వచ్చి,మళ్ళీ సమయం కాకముందుకు వెళ్లిపోతారని తెలిపారు .తాము పాఠశాలలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు,తమ పట్ల ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్న తీరు గురించి విద్యార్థులు పూర్తిగా వివరించారు. తమకు మంచినీళ్లు సరిగా ఇవ్వడం లేదని,మంచి ఆహారం కూడా పెట్టడం లేదని,తమకు సైన్స్ ల్యాబ్ లేదని,షూస్ బట్టలు కూడా సరిగా ఇవ్వడం లేదని హరీష్ రావు ముందు విద్యార్థినులు విలపించారు. ఇదంతా విన్న హరీష్ రావు ఈ విషయంపై అధికారులకు వివరిస్తానని,అలాగే అసెంబ్లీలో కూడా ఈ అంశం లేవనెత్తుతానని తెలిపారు. గురుకుల పాఠశాల విద్యార్థినిలకు న్యాయం జరిగే వరకూ వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Related posts