వీడియో జర్నలిస్ట్ శ్రీధర్ కు రూ.10,000 ఆర్థిక సాయం
– అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి
విశాఖ దక్షిణం ఆగస్టు 31(ప్రజాక్షేత్రం):ప్రముఖ ఛానల్ లో కెమెరామెన్ గా పనిచేస్తున్న సీనియర్ వీడియో జర్నలిస్ట్ శ్రీధర్ కు మాజీ ఎమ్మెల్యే, దక్షిణ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ రూ.10,000లు ఆర్థిక సాయం చేసి అండగా నిలిచారు. ఇటీవల న్యూస్ కవరేజ్ లో ప్రమాదవశాత్తు ఎడమచేయి విరిగిపోవడంతో శ్రీధర్ కొద్దిరోజులుగా ఇంటి వద్ద చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న వాసుపల్లి గణేష్ కుమార్ శనివారం ఉదయం దక్షిణ వైసీపీ శ్రేణులతో కలిసి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఏ అవసరం వచ్చినా తనకి కాల్ చేయమని భరోసా కల్పించారు. జర్నలిస్టులు అంటే ప్రభుత్వానికి ప్రజలకు వారిదిగా నిరంతరం శ్రమించే శ్రమజీవులన్నారు. పని ఒత్తిడితోపాటు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని జర్నలిస్టులను వాసుపల్లి గణేష్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం మైనార్టీ విభాగం అధ్యక్షుడు ముజీబ్ ఖాన్, గనగల్ల రామరాజు, తదితరులు పాల్గొన్నారు.